: ఆరోగ్య శాఖ నిర్వాకం... రూ. 165 కోట్లు మురగబెట్టేశారు
ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు బాధపడుతుంటే... మరోవైపు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా వైద్య, ఆరోగ్యశాఖ మురగబెడుతోంది. వినడానికి బాధాకరమైనా ఇది నిజం. మందులకోసం రూ. 330 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ. 165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఘనత వహించిన అధికారులు. మిగిలిన రూ. 165 కోట్లను మరో 15 రోజుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండటంతో మిగిలిన నిధులు కావాలంటే గవర్నర్ ఆమోదముద్ర కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరిగినా మందుల కొనుగోలు 15 రోజుల్లో పూర్తి కాదు. దీంతో, రూ. 165 కోట్లు మురిగిపోనున్నాయి. గత సంవత్సరం కూడా వైద్య, ఆరోగ్య శాఖ రూ. 70 కోట్ల రూపాయలను ఖర్చు చేయలేదు. ప్రజారోగ్యంపై మన అధికారులకున్న చిన్నచూపు ఈ ఘటనతో అర్థమవుతుంది.