: ముంబయి ఎన్నికల బరిలో 'విలన్'
విలన్ పాత్రధారి కమ్ డైరక్టర్ మహేశ్ మంజ్రేకర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన వాయవ్య ముంబయి లోక్ సభ స్థానం నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) తరపున పోటీ చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ నేడు మీడియాతో మాట్లాడుతూ, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే నుంచి ఫోన్ వచ్చిందని, టికెట్ కన్ఫర్మ్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. మన చుట్టూ జరిగే దానిపై కూర్చుని లెక్చర్లిచ్చే రకాన్ని కాదని పేర్కొన్నారు.
60 ఏళ్ళ మహేశ్ మంజ్రేకర్ పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగులో అదుర్స్, ఒక్కడున్నాడు చిత్రాల్లో ప్రతినాయకుడిగా అలరించారు. అంతేగాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. వాస్తవ్, అస్తిత్వ, జిస్ దేశ్ మే గంగా రహతా హై వంటి చిత్రాలు ఈ మరాఠీ దర్శకత్వంలోనూ రూపుదిద్దుకున్నాయి.