: త్వరలో ఆకాశ్-4: పల్లం రాజు
చౌక టాబ్లెట్ పీసీ ఆకాశ్ నాలుగో వర్షన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి పల్లంరాజు తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ వర్షన్ కు ఆకాశ్ టాబ్లెట్ పనితీరు మెరుగు పడుతోందని చెప్పారు. ఇందుకోసం తమ శాఖ తరఫున కృషిని కొనసాగిస్తామని తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో కొత్తగా ఉన్నత విద్యా కేంద్రాలను నెలకొల్పుతామని పల్లంరాజు వెల్లడించారు.