: కేంద్రంలో సంకీర్ణం తప్పదంటున్న కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి గణనీయమైన ఆధిక్యం రాదని, కేంద్రంలో సంకీర్ణం తప్పదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అంటున్నారు. హైదరాబాదులో నేడు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జాతర కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 17 సీట్లు సాధించుకుంటే తెలంగాణ సమస్యలు పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చని వివరించారు.
అస్తిత్వం మీద అందరికీ ప్రేమ ఉంటుందని, అందుకే ఇంత భారీస్థాయిలో ఉద్యమం జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్నీ వెనకబడిన జిల్లాలే అని తెలిపారు. హైదరాబాద్ కు కేంద్రం ఇచ్చిన ఐటీఐఆర్ ను ఘనంగా స్వాగతించాలని కేసీఆర్ సూచించారు. ఎక్కుడున్నా రైతులు బాగుండాలనే కోరుకుంటున్నామని తెలిపారు.