: జర్నలిస్టులపై కేసీఆర్ వరాల జల్లు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జాతర కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్ పాత్రికేయులపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. పాత్రికేయ మిత్రులు బలహీన వర్గాల కిందకే వస్తారని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ళ కోసం నిధులు కేటాయిస్తామని, ఎవరికి ఎక్కడ ఇల్లు కావాలో వివరాలు అందజేయాలని సూచించారు. అంతేగాకుండా, మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పాత్రికేయులందరికీ అక్రిడేషన్ కార్డులిస్తామని హామీ ఇచ్చారు.