: ఉద్యమం ప్రారంభించిన వేళ ఎందరో హేళన చేశారు: కేసీఆర్


ఆంధ్ర పాలకుల తీరుకు నిరసనగా తాను 2001లో ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలామంది హేళన చేశారని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తెలిపారు. అయితే, చేసే పనిలో చిత్తశుద్ధి, లక్ష్యం పట్ల పట్టుదల ఉంటే తప్పక విజయం వరిస్తుందని అన్నారు. హైదరాబాదులో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జాతర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గడీ దొరల పాలనలో తెలంగాణ ప్రజలు చాలాకాలం మగ్గిపోయారని వెల్లడించారు. ఆ తర్వాత 1952 ఎన్నికల అనంతరం పెనం మీంచి పొయ్యిలో పడ్డామని తెలిపారు. అప్పటి నుంచి తెలంగాణ సమాజం అనేక విధ్వంసకాలకు గురైందని చెప్పుకొచ్చారు. ఉద్యమంలో ఎందరో యువకులు ఆహుతైపోయారని, తెలంగాణలోని కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో భాధలు పడ్డామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News