: గంగూలీ సలహాలతో దూసుకెళతా: రైనా
ఆసియా కప్ కు టీమిండియాలో చోటు కోల్పోయిన యువ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా జట్టులోకి తిరిగొచ్చేందుకు తహతహలాడుతున్నాడు. ఈ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన రైనా ఆ టోర్నీలో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇచ్చిన సలహాలతో దూసుకెళతానని పేర్కొన్నాడీ యూపీ యువకెరటం. లోపాలను సరిదిద్దుకునేందుకు దాదా సలహాలు ఎంతో లాభించాయని చెప్పాడు. అనుకూలాంశాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని గంగూలీ సూచించాడని రైనా తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఈ నెల 16 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనుంది. తొలుత క్వాలిఫయర్ దశ ఉంటుంది.