: ఫేస్ బుక్ లో దుష్ప్రచారంపై అమీర్ ఖాన్ ఫిర్యాదు
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముంబయి పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా, జాయింట్ కమిషనర్ సదానంద్ దాతేలను కలిసి విషయం వివరించారు. తనపై దుష్ప్రచారానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.