: పనికిరాని పార్టీలకు ఓట్లు వేయొద్దు: ప్రజలకు జేపీ సూచన
వచ్చే ఎన్నికల్లో ప్రజలు పనికిరాని పార్టీలకు ఓట్లు వేయొద్దని సూచిస్తున్నారు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. ప్రజలు ఇప్పటి వరకు తామెలాంటి పార్టీలకు ఓట్లేశారో ఓసారి సమీక్షించుకోవాలని కోరారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజల అభిమానం పొందగలిగిన నిస్వార్థపరులకు తమ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.