: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 'ఆధార్' ప్రాజెక్టు చైర్మన్


కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆధార్ ప్రాజెక్టుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న నందన్ నీలేకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆయన కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. నేడు బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర, కేంద్ర మంత్రి రహ్మాన్ ఖాన్ సమక్షంలో నీలేకని పార్టీలో చేరారు. కాగా, నిన్న విడుదల చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో నీలేకని పేరు కూడా ఉంది. త్వరలోనే ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానంలో ఈయన పోటీ చేస్తారు. నీలేకని ప్రత్యర్థి బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ కు ఎంపీగా ఐదుసార్లు విజయం సాధించిన రికార్డు ఉంది.

  • Loading...

More Telugu News