: పవన్ పార్టీ పెడితే ఆలోచిస్తానంటున్న కమెడియన్
పవన్ కల్యాణ్ కొత్త పార్టీపై టాలీవుడ్ కమెడియన్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, పవన్ పార్టీ పెడితే తన ప్రవేశం గురించి, ఆనక పోటీ చేయడం గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. పవన్ ఇంకా నిర్ణయం వెలిబుచ్చకుండా తాను ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాజమండ్రి నుంచి పవన్ పార్టీ తరపున బరిలో దిగనున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.