: ఇరాక్ లో ఆత్మాహుతి దాడి... 12 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్తసిక్తమైంది. ఈ ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది విగతులయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దక్షిణ బాగ్దాద్ లోని ఓ చెక్ పోస్టు వద్దకు దూసుకువచ్చాడు. అక్కడ వాహనంతో సహా తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ కూడా ముందుకు రాలేదు.