: విషాదంలో జుహీ చావ్లా కుటుంబం
బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఇంట విషాదం నెలకొంది. జుహీ సోదరుడు బాబీ చావ్లా నేడు కన్నుమూశారు. బాబీ 2010 ఏప్రిల్ నుంచి కోమాలోనే ఉన్నారు. ఆయన గతంలో షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ కు సీఈవోగా వ్యవహరించారు. ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేటి సాయంత్రం ముంబయిలో నిర్వహించనున్నారు. కాగా, బాబీ మృతిపై షారుక్ స్పందిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. బాబీ జ్ఞాపకాలు తమకెంతో విలువైనవని ట్విట్టర్లో పేర్కొన్నారు.