: కేసీఆర్ టచ్ లోనే ఉన్నారు: జైరాం


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఇప్పటికీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లోనే ఉన్నారని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరుగుతున్న కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విభజన సందర్భంగా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ బద్ధంగా జరిగిందని, దానిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కిరణ్ ను చీఫ్ విప్ స్థాయి నుంచి సీఎంను చేస్తే, పార్టీని ధిక్కరించారని విమర్శించారు. ఇక, పురందేశ్వరిపై తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని జైరాం సమర్ధించుకున్నారు. ఎనిమిదేళ్ళుగా కాంగ్రెస్ తో లబ్దిపొంది, ఇప్పుడు విమర్శలు చేయడంతోనే ఆమెపై ప్రతి విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News