: కేసీఆర్ వల్లే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం: హరీశ్ రావు
తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఉద్ఘాటించారు. ప్రజల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇక, పొత్తులు వద్దన్న జానారెడ్డి సూచనను తాము స్వాగతిస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు.