: రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వర్షాలు
రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల విభాగం తెలిపింది. రాష్ట్రాన్ని ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దాని ప్రభావంతో ఎక్కువ చోట్ల వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.