: తెలంగాణలోనూ చాలా మంది టీడీపీలోకి వస్తున్నారు: బాబు
ఎన్టీఆర్ ట్రస్ట్ భనవన్ లో చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన అనంతరం టీడీపీలోకి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే కొందరు పార్టీలోకి వచ్చారని, మరికొన్ని రోజుల్లో ఇంకొందరు వస్తారని చెప్పారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసి తన నిజాయతీని నిరూపించుకుంటానని బాబు ధీమాగా చెప్పారు. విడిపోయిన రాష్ట్రాలను కలిపేశక్తి టీడీపీకే ఉందని బాబు నొక్కి చెప్పారు. వైఎస్సార్సీపీ వంటి పార్టీలొస్తే జాతి నిర్మాణం కుంటుపడుతుందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ను వసూల్ రాజా అని అభివర్ణించారు చంద్రబాబు. ఇప్పుడు వసూళ్ళు మొదలు పెడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. తమ వల్లే తెలంగాణ వచ్చిందని ఢిల్లీ నుంచి రాగానే గుర్రాలు, ఒంటెలపై ఊరేగారని ఎద్దేవా చేశారు.