: పవన్ కల్యాణ్ టీడీపీతో కలుస్తారని ఆశిస్తున్నాం: మురళీ మోహన్
పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. పవన్ తెలుగుదేశం పార్టీతో కలుస్తాడని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, పవన్ కొత్తపార్టీ పెడితే టీడీపీకి పాక్షికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.