: టీడీపీలో చేరడంపై టీజీ స్పందన


తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ మీడియాకు తన స్పందన తెలియజేశారు. తిరిగి మాతృ సంస్థలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తూ తిరిగి తాము టీడీపీలోకే వచ్చామని టీజీ చమత్కరించారు. తాము మంచివాళ్ళమని నమ్మే బాబు పార్టీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నా తాము మంచిపనులే చేశామని, మంచి పేరు తెచ్చుకున్నామని ఆయన వివరించారు. నాయకుడిని బట్టే పార్టీ ఉంటుందని, బాబు మంచివాడు కాబట్టే టీడీపీ కూడా అలాంటి ఖ్యాతినే పొందిందని కొనియాడారు.

  • Loading...

More Telugu News