: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఏరాసు, టీజీ
మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిరువురు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బాబు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.