: హనీమూన్ లో శృంగారానికి నో చెబితే అది క్రూరత్వం కాదు: బాంబే హైకోర్టు
హనీమూన్ లో దంపతుల్లో ఎవరైనా జీవిత భాగస్వామితో శృంగారానికి తిరస్కరిస్తే దానిని క్రూరత్వంగా పరిగణించరాదని ఓ కేసులో బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, పెళ్లయిన తర్వాత ఆఫీసు పని మీద భార్య నివాసిత ప్రాంతాన్ని విడిచి వెళ్లడం, పాంట్, షర్టులు వేసుకోవడం భర్తను హింసించడం కిందకు రావని పేర్కొంది. వైవాహిక జీవితం మొత్తాన్ని పరిశీలించి చూడాలే కానీ, నిర్ణీత పరిధిలో ఏవో కొన్నింటిని క్రూరత్వంగా భావించరాదని ధర్మాసనం తీర్పులో చెప్పింది. చెడు ప్రవర్తన దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండి, భాగస్వామి ప్రవర్తన, చర్యలు అనుబంధం దెబ్బతినే స్థాయికి చేరుకుంటే వాటిని మానసిక హింసగా భావించవచ్చని పేర్కొంది. అంతేకానీ, చిన్న చిన్న గొడవలు రోజువారీ జీవితంలో సాధారణమేనని, వీటి ఆధారంగా విడాకులు ఇవ్వలేమని ఓ దంపతుల కేసులో తీర్పు చెప్పింది.