: అరసవిల్లి సూర్యనారాయణ భక్తులకు నిరాశ


రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లిలోని సూర్యనారాయణ దేవాలయంలో మూలవిరాట్ పాదాలను భానుడి కిరణాలు తాకకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతికూల వాతావరణంతోనే సూర్య కిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించలేదని ఆలయ వర్గాలు చెబుతుండగా, ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అద్భుతాన్ని చూడలేకపోయామని భక్తులు వాపోయారు. అయితే, భక్తులు భారీగా ఎగబడడం వల్లే కిరణాలు స్వామివారి పాదాలను చేరేందుకు ప్రతిబంధకంగా మారినట్టు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్చి రెండో వారంలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది.

  • Loading...

More Telugu News