: విమానం కోసం కొనసాగుతున్న గాలింపు
దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయినట్లు భావిస్తున్న మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ ఇంత వరకు లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ కు 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో వెళుతున్న విమానం శనివారం తెల్లవారుజామున అదృశ్యమైన విషయం తెలిసిందే. సముద్రంలో రెండు చోట్ల చమురు తెట్టెలు కనిపించడంతో వియత్నాం నౌకలు అక్కడకు చేరుకున్నాయి. కానీ, విమాన శకలాలు ఏమీ లభించలేదు. గాలింపు చర్యలను విస్తృత పరచినట్లు మలేసియా రవాణా మంత్రి హిషముద్దీన్ హుస్సేన్ తెలిపారు.