: మరో వారంలో టీడీపీలోకి: జేసీ
వారం రోజుల్లో టీడీపీలో చేరనున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా నుంచి తాను లోక్ సభకు పోటీ చేస్తానని, తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి శాసనసభకు పోటీ చేస్తాడని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సామర్థ్యంపై నమ్మకంతోనే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్లేనని అభిప్రాయపడ్డారు.