: 194మంది లోక్ సభ అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలిజాబితా


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 194 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాయ్ బరేలి నుంచి పోటీ చేయనుండగా, రాహుల్ గాంధీ అమేధీ నుంచి పోటీ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసిన తొలి జాబితాలో 28మంది మహిళలకు స్థానం దక్కింది. మీరాకుమార్ బీహార్ లోని ససరాం నుంచి, ఆధార్ చైర్మన్ నందన్ నీలేకని దక్షిణ బెంగళూరు నుంచి, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ప్రధాని వాజపేయి మేనకోడలు కరుణా శుక్లా బిలాస్ పూర్ నుంచి బరిలోకి దిగనుండగా, సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ నుంచి, క్రికెటర్ మహ్మద్ కైఫ్ యూపీలోని పూల్ పూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క అభ్యర్ధి కూడా లేకపోవడం గమనార్హం!

  • Loading...

More Telugu News