: రేపు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటరు నమోదుకు మరో అవకాశం
ఆదివారం నాడు, అంటే 9వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు రేపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పేరు నమోదుతో పాటు ఓటరు కార్డుల్లో ఏవైనా తప్పులున్నా సవరించుకొనే అవకాశం కూడా కల్పించినట్టు ఆయన చెప్పారు.