: బాబు ఆరోగ్యస్థితిపై అనుమానాలున్నాయి: వైఎస్సార్సీపీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. బాబు ఆరోగ్యస్థితిపై అనుమానాలున్నాయని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్న బాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా అధికారం దక్కదని స్పష్టం చేశారు. బాబు చివరికి అంతరించిపోయే పార్టీకి అధ్యక్షుడిగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. జగన్ ను విమర్శించే స్థాయి బాబుకు లేదని గట్టు పేర్కొన్నారు.