: ఇష్టదైవాన్ని సేవించుకున్న టీమిండియా కెప్టెన్


టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టి20 వరల్డ్ కప్ కు సన్నద్ధమవుతున్నాడు. గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమైన ధోనీ పూర్తిగా కోలుకున్నాడు. ప్రధాన టోర్నీలకు ముందు ఈ జార్ఖండ్ డైనమైట్ ఎప్పుడూ తన ఇష్టదైవం దుర్గా దేవేరిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలోని దేవేరి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ అమ్మవారికి పూజలు చేసిన ధోనీకి అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ల్యాండ్ రోవర్ కారులో తన తండ్రితో కలిసి ఇక్కడికి వచ్చిన ధోనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కాగా, ధోనీ రాకను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News