: తెలంగాణలో ఇతర పార్టీలను నమ్మే పరిస్థితి లేదు.. పవన్ ఎంట్రీపై జాగృతి కవిత
తెలంగాణలో ఆంధ్రా పార్టీలు చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు ఇప్పటిదాకా చూశారని... ప్రస్తుతం టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలను నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పవన్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ... సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన వస్తే ప్రజలు ఆదరిస్తారని... అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆయనకు ఎలాంటి ప్రజా మద్దతు ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చిందని... తాను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయించలేదని ఆమె చెప్పారు.