: ప్రధానికి మరోసారి లేఖ రాసిన జయలలిత
తమిళనాడు సీఎం జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్ కు మరోసారి లేఖ రాశారు. శ్రీలంక నేవీ చెరలో ఉన్న తమిళనాడు జాలర్లకు విముక్తి కల్పించే విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆమె తన లేఖలో కోరారు. గత రెండేళ్ళుగా లంక నావికాదళం 177 మంది జాలర్లను, 44 బోట్లను అదుపులోకి తీసుకుందని జయ వివరించారు. అత్యున్నత స్థాయి దౌత్య మార్గాల ద్వారా ప్రధాని తమిళనాడు జాలర్లను భారత్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 13న కొలంబోలో భారత్-శ్రీలంక వర్గాల మధ్య చర్చలుండగా, లంక నేవీ సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని జయ ఆరోపించారు.