: కాంగ్రెస్ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తుంది: గీతారెడ్డి


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి గీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆమె అన్నారు. జానారెడ్డి నివాసంలో ఈరోజు జరిగిన టీ-కాంగ్రెస్ నేతల భేటీలో గీతారెడ్డి పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తుందని, అభివృద్ధికి మారుపేరని ఆమె చెప్పారు. వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి వెంటనే ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News