: పాక్ ను ఆదుకున్న మిస్బా, ఫవాద్ జోడీ
ఆసియా కప్ ఫైనల్లో యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ ధాటికి కుదేలైన పాకిస్తాన్... కెప్టెన్ మిస్బావుల్ హక్, ఫవాద్ ఆలంల సమయోచిత బ్యాటింగ్ తో కోలుకుంది. మలింగ ఓపెనింగ్ స్పెల్ కు దాసోహమన్న పాక్ ఓ దశలో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే, మిస్బా, ఫవాద్ జోడీ నాలుగో వికెట్ కు అజేయంగా 93 పరుగులు జోడించి జట్టును ఆదుకుంది. ప్రస్తుతం పాక్ జట్టు 32 ఓవర్లలో మూడు వికెట్లకు 111 పరుగులు చేసింది. మిస్బా 52, ఫవాద్ 41 పరుగులతోనూ ఆడుతున్నారు.