: టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వారి స్థానాల్లో పోటీ చేస్తారు: మధుయాష్కీ
తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా తమ స్థానాల నుంచే పోటీ చేస్తారని ఎంపీ మధుయాష్కీ తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని తెలిపారు.