: ఒబామా అత్యంత చెత్త అధ్యక్షుడు: బాబీ జిందాల్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై లూసియానా రాష్ట్ర గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ (42) విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఒబామా అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడని అభివర్ణించారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో ఒబామా అనుసరించిన విదేశాంగ విధానాన్ని జిందాల్ తప్పుబట్టారు. 'ఇప్పటి వరకు నేను ప్రెసిండెట్ కార్టర్ మాత్రమే చెత్త అధ్యక్షుడని భావించేవాడిని. ఒబామా నా అభిప్రాయం తప్పని నిరూపించారు' అని జిందాల్ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ లో నిన్న జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన జిందాల్ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News