: జయలలితకు ప్రచారం చేయనున్న అలనాటి అందాల నటి
వచ్చే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరపున అలనాటి అందాల నటి వెన్నిరాడై నిర్మల ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయనున్న 19 మందితో కూడిన స్టార్ ప్రచారకుల జాబితాలో వెన్నిరాడై నిర్మలతో పాటు నటులు, దర్శకులు, కమెడియన్లు, విలన్లు ఉన్నారు. జయలలిత, వెన్నిరాడై నిర్మల ఇద్దరూ కూడా దాదాపు ఒకే సమయంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో, 11వ తేదీ నుంచి ఆమె ప్రచారం చేస్తారని అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది.