: తిరుమలేశుని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎన్.సంపత్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకొన్నారు. ఈరోజు (శనివారం) ఉదయం కల్యాణోత్సవం సమయంలో సంపత్ తిరుమలేశుని సేవలో పాల్గొన్నారు. వెంకన్న ఆలయంలోకి ప్రవేశించిన సంపత్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.