: సముద్రంలో కూలిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం


కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలు దేరిన మలేషియన్ ఎయిర్ లైన్స్ (ఎంహెచ్ 370) విమానం సముద్రంలో కూలిపోయింది. వియత్నాంకు చెందిన తోచూ ద్వీపానికి ఆనుకుని ఉన్న సముద్రంలో 153 మైళ్ల దూరంలో విమానం కూలిపోయిందని వియత్నాం నేవీ అధికారులు ప్రకటించారు. దీంతో ఈ విమానంలో ఉన్న 227 మంది ప్రయాణికులతో పాటు 12 మంది విమాన సిబ్బంది దుర్మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు. వీరిలో దాదాపు 150 మంది చైనీయులు ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు కౌలాలంపూర్ లో బయలుదేరిన విమానానికి 2 గంటల తర్వాత గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి.

  • Loading...

More Telugu News