: 11న బీజేపీ తెలంగాణ ఆవిర్భావ సభ
ఈ నెల 11న హైదరాబాద్ లోని నిజాంకళాశాల మైదానంలో బీజేపీ తెలంగాణ ఆవిర్భావ సభను నిర్వహించనుంది. దీనికి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత అరుణ్ జైట్లీ హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బీజేపీతోనే సాధ్యమైందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. తమ వల్లే బీజేపీ వచ్చిందన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడతామని చెప్పారు.