: బాబాయ్ అంటే గౌరవం.. కానీ నాన్నకే నా మద్దతు: రాంచరణ్
పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మరో హీరో రాంచరణ్ స్పందించాడు. బాబాయ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని... ఆయనకు అన్ని విషయాల్లో మా కుటుంబ మద్దతు ఉంటుందని... అయితే రాజకీయాల్లో మాత్రం తాను నాన్నకే మద్దతు ఇస్తానని స్పష్టం చేశాడు. "నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కనబెడితే.. మా కుటుంబంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చని... దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు" అన్నాడు. తనకు రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేదని తెలిపాడు. బాబాయ్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతం అని చెప్పాడు.