: మలేషియా ఎయిర్ లైన్స్ విమానం గల్లంతు


కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం మార్గ మధ్యంలోనే గల్లంతైంది. అర్ధరాత్రి 12 గంటలకు కౌలాలంపూర్ లో టేకాఫ్ అయిన విమానం ఈ ఉదయం 6 గంటలకు బీజింగ్ చేరుకోవాల్సి ఉంది. బయలుదేరిన 2 గంటల తర్వాత ఆ విమానంతో గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 227 మంది ప్రయాణికులతో పాటు 12 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో 150 మంది చైనీయులు ఉన్నారు. గల్లంతైన విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News