: పురంధేశ్వరిపై విరుచుకుపడ్డ రేణుకాచౌదరి
హస్తానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కూతురై ఉండి కూడా ఆయన స్థాపించిన టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో ఏ లాభాపేక్షతో చేరారని ప్రశ్నించారు. ఇప్పుడు మరే ఉద్దేశంతో బీజేపీలోకి అడుగుపెట్టారని నిలదీశారు. పురంధేశ్వరి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.