: దాసరి నారాయణరావుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది.
వున్న వాటికి తోడు కొత్త పార్టీలు పుట్టుకు వస్తుండడంతో రోజు రోజుకూ రాజకీయం రంజుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త పార్టీ సన్నాహాల్లో వున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంకాలం హైదరాబాదులో ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దాసరి నివాసానికి వెళ్ళిన కిరణ్ చాలా సేపు ఆయనతో మంతనాలు జరిపారు.
తాను నెలకొల్పబోయే పార్టీకి సహకరించాల్సిందిగా దర్శకరత్నను మాజీ సీఎం కోరినట్టు సమాచారం.
మరి, దాసరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!