: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు: చంద్రబాబు
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... బీసీల్లో చైతన్యం బాగా ఉందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. సరైన అవకాశాలు లభిస్తే బీసీలు మరింత బాగా పనిచేస్తారని ఆయన అన్నారు.