: అన్న దుకాణం బంద్ అయింది, ఇక 'తమ్ముడు' బయల్దేరాడు: కేసీఆర్
పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తనదైన శైలిలో స్పందించారు. రాజకీయాల్లోకి మరో సినీ స్టార్ వస్తున్నాడని వ్యాఖ్యానించారు. విభజన నేపథ్యంలో అన్న (చిరంజీవి) దుకాణం బంద్ అయిందని, ఇప్పుడు ఇక తమ్ముడు (పవన్ కల్యాణ్) బయల్దేరాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.