: బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు: బీసీ సంఘాల నేతలు
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు (శుక్రవారం) సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు, బీసీలకు ప్రత్యేక బడ్జెట్ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు బీసీలమంతా ఒక్క తాటిపైకి వస్తున్నామని వారు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని బీసీ సంఘాల నేతలు తెలిపారు.