: రూ.32 లక్షల విలువైన నగలు నొక్కేసిన లేడీ డాక్టర్


బెంగళూరులో ఓ వైద్యురాలి చేతివాటం చూడండి... రూ.32 లక్షల విలువైన ఆభరణాలను చోరీ చేసింది. తస్కరణ విద్యను ఓ అలవాటుగా మార్చుకున్న ఈ లేడీ డాక్టర్ పేరు కల్పన (51), వైఫ్ ఆఫ్ రంగనాథ్ అడిగ. నగరంలోని బసవేశ్వర నగర్ లో నివసించే ఈ చోర శిఖామణి 2008లో ఓ ల్యాప్ టాప్ దొంగిలించిన కేసులోనూ నిందితురాలు. ఇటీవలే ఓ నగల ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రదర్శనలో కొన్ని నగలు కనిపించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా ఓ మహిళ వాటిని తస్కరించినట్టు స్పష్టమైంది. ఆమె ఎవరని ఆరా తీస్తే, చివరికి డాక్టర్ కల్పన అని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. విచారణలో ఈ కిలాడీ తన నేరాలను అంగీకరించిందని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.

  • Loading...

More Telugu News