: గవర్నర్ నరసింహన్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నరును ఈరోజు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కలిశారు. తెలంగాణ ప్రాంతంలో వడగళ్ల వర్షం వల్ల మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని, అలాగే పంట దెబ్బ తిన్న రైతులకు హెక్టారుకు రూ.20 వేలు నష్ట పరిహారంగా ఇవ్వాలని వారు గవర్నరుకు విన్నవించారు.