: కేపీని బలిపశువును చేశారు: రిచర్డ్స్


యాషెస్ లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయానికి కెవిన్ పీటర్సన్ ను బలిపశువును చేశారని అలనాటి బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఆ పర్యటనలో ఎదురైన వైట్ వాష్ కు కేపీని కారణంగా చూపడం సరికాదని ఇంగ్లిష్ క్రికెట్ బోర్డుకు హితవు పలికారు. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు సేవకుడిలాంటి వాడని, అలాంటి వ్యక్తిని అమర్యాదకరంగా సాగనంపడం నిరుత్సాహకరమని పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్ మాట్లాడుతూ, అతని వైఖరి సవ్యంగా లేకుంటే, ఆ సిరీస్ లో ఐదు టెస్టుల్లో ఎందుకు అవకాశమిచ్చారని ఇంగ్లండ్ సెలక్టర్లను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News