: సభలకు ప్రజలు వస్తే, సీట్లొచ్చినట్టేనా?: బీజేపీకి అఖిలేశ్ చురక
బీజేపీపై యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో యూపీలో బీజేపీకి కొద్దిగా ఆదరణ లభిస్తుండవచ్చని, అంతమాత్రాన ఎన్నికల ఫలితాలు వారికి అనుకూలంగా ఉంటాయని భావించరాదని వ్యాఖ్యానించారు. కాషాయదళం కాసింత విస్తరించిందేమోగానీ, మోడీ ప్రాభవమేమీ ఇక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. వారి సభలకు ప్రజలు భారీగా వస్తే రావచ్చనీ, అంతమాత్రాన ఎన్నికల్లోనూ సీట్లు అదే రీతిలో వస్తాయనుకోకూడదనీ ఆయన అభిప్రాయపడ్డారు.