: రాజమండ్రిలో టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ నియామకాలు


రాజమండ్రిలో సాఫ్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ నెల 8వ తేదీ, శనివారం నాడు ఆఫ్ క్యాంపస్ నియామకాలు చేపడుతోంది. రాజమండ్రి శివారులోని భూలపట్నం వద్దనున్న ఆర్.ఐ.యి.టి.లో ఈ నియామక కార్యక్రమం జరుగనుంది. ఆర్ఐయిటి కరస్పాండెంట్ డాక్టర్ రమేశ్ బాబు కళాశాల ప్రాంగణంలో ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. బి.టెక్ చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నియామక కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. టీసీఎస్ వద్ద నమోదు చేసుకున్న 900 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.

  • Loading...

More Telugu News